ఇళ్లు కట్టేవారికి గుడ్ న్యూస్.. తగ్గనున్న సిమెంటు ధరలు..

ఇళ్లు కట్టేవారికి గుడ్ న్యూస్.. తగ్గనున్న సిమెంటు ధరలు..

సిమెంటు సంస్థల అధినేతలు, ప్రతినిధులతో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణరంగానికి ఊతం ఇచ్చే ఉద్దేశంతో ఈ భేటీ నిర్వహించారు. నిర్మాణ రంగం ఊపందుకొనేందుకు సిమెంట్‌ ధరలను తగ్గించాలని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనలకు సిమెంట్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి.
అయితే, సిమెంటు ధరలను ఏ మేరకు తగ్గించాలనే అంశంపై తాము చర్చించుకుంటామని వారు వెల్లడించారు. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు మంత్రులకు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలైన డబుల్ బెడ్ రూం ఇళ్లు సహా, ఇతర పథకాలకు మరో మూడేళ్లపాటు సిమెంటు బస్తా రూ.230కి ఇచ్చేలా గురువారం సిమెంట్‌ సంస్థలు అంగీకారం తెలిపాయి.

Post a Comment

0 Comments