కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించడం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న తమ మీద దాడి చేయడాన్ని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హాస్పిటల్ ముందు రోడ్డు మీద బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. మంగళవారం కరోనా పేషెంట్ ఒకరు చనిపోయారు. హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. మరణించిన వ్యక్తి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. జూనియర్ డాక్టర్లపై దాడికి తెగబడ్డారు.
పేషెంట్లను కాపాడటం కోసం తాము అహర్నిశలు శ్రమిస్తుంటే.. గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ దాడులు చేస్తారా అంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి సమ్మెకు దిగారు. బుధవారం కూడా సమ్మెను కొనసాగిస్తూ రోడ్డు మీద బైఠాయించారు. జూనియర్ డాక్టర్లు రోడ్డు మీదకు రావడానికి ప్రయత్నించడంతో.. గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్‌కు రావాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.
0 Comments