హోలీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు రంగులతో సంబరాలు ఎందుకు జరుపుకుంటారు?

హోలీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు రంగులతో సంబరాలు ఎందుకు జరుపుకుంటారు?




 హిరణ్య కశ్యపుని సోదరి హోలిక.. ప్రహ్లాదుడుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని అంటారు. అలాగే, ఫాల్గుణ పౌర్ణమి నేపథ్యంలో కొందరు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు.

కొత్త కొత్త Whats app స్టేటస్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

Post a Comment

0 Comments