ఇతడి ఆటో ఎక్కాలంటే అలా చేయాల్సిందే!

ఇతడి ఆటో ఎక్కాలంటే అలా చేయాల్సిందే!

 
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణించే వారి భద్రత కోసం వినూత్నంగా ఆలోచించారు. ఆటోలోనే నీళ్ల ట్యాంక్, శానిటైజర్ ఏర్పాటు చేశారు. 

ప్రయాణికులు కరోనా బారిన పడకుండా నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుని శానిటైజర్ రాసుకుని ఆటో ఎక్కుతున్నారు. యానాంకు చెందిన ఆటో డ్రైవర్ కరోనా నేపథ్యంలో ఆటోలో ప్రయాణికులు తగ్గడంతో తన భార్య లక్ష్మీ సలహాతో రెండు లీటర్ల నీళ్లు పట్టే వాటర్ ట్యాంకును స్థానిక వెల్డర్‌తో తయారు చేయించి దాన్ని శానిటైజర్ బాటిల్‌తో సహా ఆటోకు అమర్చాడు. 

దీన్ని తయారు చేయడానికి రూ.600 ఖర్చు అయిందని తెలిపారు. దీంతో ఆటో ఎక్కే ప్రయాణికులు మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుని ఎటువంటి భయం లేకుండా ప్రయాణిస్తున్నారు.

Post a Comment

0 Comments