బోనాల వేడుకలు రద్దు.. ఈసారి ఇంట్లోనే బోనం

బోనాల వేడుకలు రద్దు.. ఈసారి ఇంట్లోనే బోనం

కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో కనిపించే బోనాల సందడి ఈసారి లేనట్లే. ఈసారి ఇంట్లోనే బోనం 

సమర్పించుకోవాలని మంత్రి 

తలసాని శ్రీనివాస్ యాదవ్ 

పిలుపునిచ్చారు.


 కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ 

ఏడాది సామూహిక బోనాల 

వేడుకలు రద్దు చేస్తున్నట్లు 

బుధవారం (జూన్ 10) ఆయన ప్రకటించారు. 


ఆలయాల్లో అమ్మవార్లకు 

పూజారులు మాత్రమే బోనాలు 

సమర్పిస్తారని తెలిపారు. 


ప్రజలు ఎవరి ఇంట్లో వారే 

దేవతలకు బోనాలు 

సమర్పించుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments