తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ శుక్రవారం ఉదయం నుంచి సమ్మె విరమించింది

తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ శుక్రవారం ఉదయం నుంచి సమ్మె విరమించింది

తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ శుక్రవారం ఉదయం నుంచి సమ్మె విరమించింది. గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్ పేషెంట్ బంధువులు డాక్టర్‌పై దాడికి నిరసనగా మంగళవారం రాత్రి జూడాలు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేశారు. బుధవారం రోడ్డు మీద బైఠాయించిన జూనియర్ డాక్టర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల భరోసా ఇవ్వడంతో వారు కాస్త మెత్తబడ్డారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు వస్తోన్న పేదలను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరుతున్న జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.

తమకు మెరుగైన భద్రత కల్పించాలని, గాంధీ హాస్పిటల్‌ నుంచి వేరే హాస్పిటళ్లకు కరోనా పేషెంట్లను మార్చాలని డిమాండ్ చేస్తూ.. 300 మందికిపైగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. జూడాలా మాట్లాడిన ఆరోగ్య మంత్రి ఈటల.. వారి డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సారి కేసులు, లక్షణాలు లేని కరోనా రోగులకు జిల్లాల్లోని హాస్పిటళ్లు, ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో చికిత్స అందించాలని జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. సిబ్బంది కొరతను ఎదుర్కోవడానికి మరింత మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ వర్కర్లను నియమించాలని, 30 శాతం అదనపు సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments