కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో ట్యాబ్లెట్‌ ‌ధర ఎంతో తెలుసా…?

కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో ట్యాబ్లెట్‌ ‌ధర ఎంతో తెలుసా…?

హైదరాబాద్‌ :  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఒక ఫవిపిరావీర్​ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్… గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది.

వైద్యుల సలహా తప్పనిసరి…

మొదటి రోజు 1,800 మి.గ్రా మోతాదులో రెండు సార్లు చొప్పున మొదలు పెట్టి… 14వ రోజునాటికి రోజుకు రెండు సార్లు 800 మి.గ్రా మోతాదుకు.. దీనిని తగ్గిస్తూ రావాలని పేర్కొంది. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వీటిని వాడవచ్చని వెల్లడించింది.

హిమాచల్​ప్రదేశ్​లో…

ప్రస్తుతం ఈ టాబ్లెట్లను హిమాచర్​ప్రదేశ్​లో ఉత్పత్తి చేస్తున్నట్లు గ్లెన్​మార్క్ తెలిపింది. ఆసుపత్రుల్లో, రిటైల్ దుకాణాల్లో ఈ ఔషధం లభిస్తుందని వెల్లడించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతి పొందినట్లు ముంబయికి చెందిన ఈ సంస్థ పేర్కొంది.భారత్​లో విపరీతంగా కొవిడ్​ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహమ్మారి నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని గ్లెన్​మార్క్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments