అమ్మమ్మ చేసిన చికెన్ కర్రీ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి..

అమ్మమ్మ చేసిన చికెన్ కర్రీ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి..

వృద్యాప్యంలో మతిస్థిమితంతో బాధపడుతున్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిపింది. ఈ విషగుళికలు కలిపిన ఆహారం తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

చిత్తూరు మండలంలోని బ్రాహ్మణ పల్లికి చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఊరైన ఏఎల్ పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి.. పిల్లలకు పెడదామని భావించింది. చికెన్ చేసే సమయంలో మసాలా బదులు ఏకంగా గుళికలు, మందులు వేసేసింది.

ఈ గుళికలు వేసిన చికెన్ భోజనం తినడంతో ఆ ఇద్దరు బాలురు మృతి చెందారు. మతిస్థిమితం లేని అమ్మమ్మ వంట వండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చివరకు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments