బాత్‌రూమ్‌లో 35 పాము పిల్లలు

బాత్‌రూమ్‌లో 35 పాము పిల్లలు

పాము కనిపిస్తేనే భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ఒకరి కాదు రెండు కాదు ఏకంగా 35 పాము పిల్లలు ఒక్కసారిగా కనిపిస్తే చూసినవాళ్ల పరిస్థితి ఎలా ఉంటదో ఊహించారా? ఇలాంటి సంఘటనే తమిళనాడులో ఓ వ్యక్తికి ఎదురైంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూరు ఈ ఘటన చోటుచేసుకోంది. కోవిమేడుకు చెందిన మనోహరన్‌ శుక్రవారం స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లాడు. 

ఆ సమయంలో అక్కడ 35 పాము పిల్లలను గమనించాడు. దాంతో భయంతో అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. అనంతరం తేరుకుని వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఆ పాములను పట్టుకుని, వాటిని రస్సెల్‌ వైపర్‌గా గుర్తించి, సత్య మంగళం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

Post a Comment

0 Comments