పాఠాలు చెప్పిన చేతులతోనే పంక్చర్లు..ఉపాధిని మింగేసిన లాక్‌డౌన్‌

పాఠాలు చెప్పిన చేతులతోనే పంక్చర్లు..ఉపాధిని మింగేసిన లాక్‌డౌన్‌

ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ.. దశాబ్ద కాలం వివిధ కళాశాలల్లో సహాయ ఆచార్యుడి(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)గా ఉద్యోగం. కానీ.. ‘కొవిడ్‌-19’ ప్రభావంతో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. వేరే చోట కూడా ఉపాధి అవకాశాల్లేవు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూరుకు వచ్చారు. పొట్టకూటి కోసం మళ్లీ చేతి వృత్తి బాట పట్టారు. ఆయనే.. మధిర మున్సిపాలిటీలోని బంజారాకాలనీకి చెందిన వి.రవీందర్‌

హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా గత మార్చి వరకు పనిచేశారు. రాజధానిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ విభాగంలో మొన్నటి వరకు విధులు నిర్వహించగా.. లాక్‌డౌన్‌తో కళాశాల యాజమాన్యం చివరి నెల జీతం కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు ఇల్లు గడవటం కష్టంగా మారింది. చేసేదేమీ లేక సొంతూరికి వచ్చి మోటారు సైకిల్‌ మెకానిక్‌గా పని ప్రారంభించాడు. ‘మా సతీమణి కూడా ఎంటెక్‌ పూర్తి చేశారు. లాక్‌డౌన్‌తో ఇద్దరు పాపలతో కలిసి ఇంటికొచ్ఛా ఇప్పుడు మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు’ రవీందర్‌ ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.

Post a Comment

0 Comments