దేశంలో మళ్లీ లాక్‌డౌన్? కేసీఆర్ ప్రశ్నకి మోదీ క్లారిటీ

దేశంలో మళ్లీ లాక్‌డౌన్? కేసీఆర్ ప్రశ్నకి మోదీ క్లారిటీ



దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న వదంతులు అక్కడక్కడా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో దానిపై స్పష్టత వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మోదీకి చెప్పారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని మోదీని కేసీఆర్ కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ దశ ముగిసి.. అన్‌లాక్‌ల దశ నడుస్తోందని చెప్పారు. దేశంలో ఇకపై లాక్ డౌన్ ఉండబోదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న దశ అన్‌లాక్ 1 అని వివరించారు. దీని తర్వాత అన్‌లాక్ 2ను ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించాలని మోదీ సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నివారణకు చేపడుతున్న చర్యలను కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. వైరస్ నివారణకు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని చెప్పారు. 

Post a Comment

0 Comments