పరారిలో 70 మంది కరోనా రోగులు… తప్పుడు చిరునామ, ఫోన్‌ ‌నెంబర్లు

పరారిలో 70 మంది కరోనా రోగులు… తప్పుడు చిరునామ, ఫోన్‌ ‌నెంబర్లు


హైదరాబాద్‌ (‌చట్టం) : మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో పెద్ద సమస్య వచ్చి పడింది. 70మంది కరోనా రోగులు ముంబైలో పరారయ్యారు. ఇక వీరికి టెస్టులు చేస్తున్న సమయంలో ఇచ్చిన ఫోన్‌ ‌నెంబర్లు, ఇంటి చిరునామాలు తప్పుగా ఇవ్వడంతో వారి ఆచూకి తెలుసుకోవడం తలనొప్పిగా మారింది.

 ఇక చేసేదేమి లేక ముంబై మున్సిపల్‌ ‌సిబ్బంది పోలీసులు సహాయం కోరినట్లు తెలుస్తోంది. ఇంకో విషయమేమిటంటే అదృశ్యమైన వారంతా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మలాడ్‌ ఏరియాకు చెందిన వారిగా అధికారులు చెప్తున్నారు. టెస్టులు చేసే సమయంలో వారి వివరాలు, ఫోన్‌ ‌నెంబర్లు నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండవచ్చని ముంబై గార్డియన్‌ ‌మంత్రి అస్లామ్‌ ‌షేక్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

రోగుల అదృశ్యంపై స్పందిస్తూ రోగులు చెప్పిన ప్రాంతాలన్ని మురికి వాడలేనని, వారిలో కొందరు వలస కార్మికులు ఉండొచ్చని తెలిపారు. మరోవైపు కరోనా వచ్చిన విషయం తెలియకుండా సొంతూళ్లకు వెళ్లిపోయారా అన్న టెన్షన్‌ అధికారుల్లో మొదలైంది. పోలీసులు మాత్రం వారిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరోనా వీరి నుండి మరొకరికి సోకితే కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Post a Comment

0 Comments