దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా 15వ రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.8కు పైగా పెరిగింది. అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతూ వస్తున్నాయో ఒకసారి కారణాలు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు 20 డాలర్ల కిందకు పతనమైనప్పుడు దేశీ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా దిగొస్తాయని అందరూ ఆశించారు. కానీ అలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించలేదు. పైగా ఎక్సైజ్ సుంకాన్ని 2 సార్లు పెంచింది. మార్చి నెలలో రూ.3, మే నెలలో రూ.13 వరకు పెంచేసింది. రిటైల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ పెంపు భారాన్ని భరిస్తాయని తెలిపింది. అయితే ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తూ వస్తున్నాయి.

అంతేకాకుండా ఇప్పుడు క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదివరకు 20 డాలర్లకు పడిపోయి బ్యారెల్ ముడి చమురు ధరలు ఇప్పుడు 40 డాలర్లకు పెరిగాయి. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ క్రూడ్ ధరలు, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు ప్రాతిపదికన రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అంతేకాకుండా పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ కూడా పెంచేశాయి. దీంతో రేట్లు మరింత పెరిగాయి.
0 Comments