తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు పనిచేసేలా మార్గదర్శకాలు రూపొంచించింది. మిగతా 50 శాతం మంది మరునాడు కార్యాలయానికి వస్తారని పేర్కొన్నది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై-04 వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆఫీసుల్లో నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. 50 శాతం మంది ఉద్యోగులు కార్యాలయానికి వస్తే.. మిగతా వారు ఇంటికే పరిమితం కానున్నారు. అంటే వారానికి ఒక్కో ఉద్యోగి మూడు రోజులు కార్యాలయానికి వెళ్లనున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

నాలుగో తరగతి సిబ్బంది, క్లర్క్స్, సర్క్యులేట్ ఆఫీసర్స్ దినం తప్పి దినం విధులకు హాజరవుతారు. వారు అధికారులు ప్రత్యేక చాంబర్‌లో విధులు నిర్వస్తారు. సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్‌ అధికారులు సహా ఉద్యోగులంతా అందుబాటులో ఉంటారు. అయితే అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మాత్రం ఇంటే వద్దే ఉండాలని పేర్కొన్నది. దీంతోపాటు ముందుజాగ్రత్త చర్యగా రోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్‌ చేయాల‌ని.. కార్యాలయాల్లో ఉద్యోగులు ఏసీ వాడొద్దని సూచించింది.

Post a Comment

0 Comments