.......@మరుగున పడిన మనవారి చరిత్ర.@ .......
తెలుగుతేజం బోదిధర్మ......
ఖండాలు దాటి ఆత్మరక్షణ విద్యను విశ్వ వ్యాప్తం చెసిన వీరుడు
తెలుగువారు మరచిపోయి తెలుగు నెలలో
ముద్రలు వేసుకున్న మన మహా వీరుడు
చైనాకు ఆయుర్వేదం నీ పరిచయం చెసిన వైద్యుడు
శరీరాన్నీ మనస్సును మానవశంలో ఉంచుకుని సంవత్సరాల తరబడిగా యోగముద్రలో ఉంచే వశీకరణ తంత్రాన్ని ప్రపంచానికి నేర్పిన మహా యోగి
సొంత గడ్డపైన నామరూపాలు లేకపోయినా
చైనా. జపాన్. కొరియా . లాంటి దేశంలో
పూజలందుకుంటూ మహోన్నతుడు మన తెలుగు వాడు
జెన్ సాంప్రదాయానికి చైనాలో
మొదటి గురువుగా బోధిధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు.ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేలమంది జిజ్ఞాసువులు
సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్నిపొందారోలెక్కలేదు.
ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది.
భోధిధర్మా 5లెక 6 వ శతాబ్ధానికి చెందినవాడు. భోధిధర్మా ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఛైనా, టిబెటన్ భాషలలో భోధిధర్మా జీవిత చరిత్ర ఆతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. భోధిధర్మా పల్లవ సామ్రాజ్యానికి మూడవ తెలుగు చక్రవర్తి. బౌద్ధము పట్ల ఆకర్షితుడై బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
పల్లవరాజు సుగంధుని మూడవ సంతానంగా చరిత్ర కారులు భావిస్తున్నారు.ప్రపంచం మీద విరక్తి చెందిన ఈయన సింహాసనాన్ని త్యజించి ధ్యానబౌద్ధ సాంప్రదాయానికి చెందిన ఇరవై ఏడవ గురువైన ప్రజ్ఞాతారకు శిష్యుడైనాడు. ఎన్నో ఏండ్ల ఏకాంత ధ్యానసాధన తర్వాత బుద్ధత్వాన్ని పొందాడు.
తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు ధ్యానబౌద్ధాన్ని చైనాలో ప్రచారం చెయ్యడానికి సముద్రమార్గంలో చైనా చేరాడు.
అక్కడ దక్షిణ చైనాను "వు" అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన బౌద్ధ మతానుసారి. దానధర్మాలు చేసినవాడు.ఎన్నో బౌద్ధ ఆరామాలు కట్టించిన వ్యక్తి. కాని బోధిధర్ముని మాటలు ఆయనకు నచ్చలేదు.అప్పటివరకూ ఆయన చూచిన బౌద్ధ భిక్షువుల తీరుకూ బోధిధర్మ తీరుకూ బోలెడంత తేడా ఉంది.
బోధిధర్మ ఉత్త బౌద్ధపండితుడు కాదు.త్రిపిటకాలను బట్టీపట్టి ఒప్పజెప్పే వ్యక్తి కాదు. బుద్ధత్వాన్ని పొందినవాడు.శాస్త్రచర్చలకూ,ఆచారాలకు,క్రియాకలాపాలకు భిన్నమైన ధ్యానబౌద్ధ శాఖకు చెందినవాడు.వారిద్దరి మధ్యన జరిగిన చర్చ ఇప్పటికీ ఒక శిలా శాసనంలా నిలిచిపోయింది.
బోధిధర్మను ఆహ్వానించటానికి "వు" చక్రవర్తి వచ్చాడు.కాని ఆయన అప్పటి వరకు చూచిన బుద్ధధర్మం కంటే భిన్నమైన ధర్మాన్ని బోధిధర్మలో చూచాడు. చక్రవర్తి అప్పటి వరకూ చేసిన పుణ్యకార్యాలకు,కట్టించిన మఠాలకు,చేసిన దానధర్మాలకు,ఏమాత్రం విలువ లేదని తేల్చిచెప్పాడు బోధిధర్మ.నిర్వాణాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందకపోతే ఇవన్నీ వృధాపనులని ఖరాఖండిగా చెప్పేశాడు.
బుద్ధుని అత్యున్నత బోధన శూన్యత్వమనీ,దానిలో ఏ ప్రత్యేకతా లేదనీ తేల్చిచెప్పాడు. పిచ్చికోపం వచ్చిన చక్రవర్తి " అంతా శూన్యం అయితే మీరు ఎవరు స్వామీ?" అని బోధిధర్మను అడుగుతాడు.దానికి బోధిధర్మ క్లుప్తంగా "నాకు తెలియదు" అని మాత్రం జవాబు చెబుతాడు.ఈ సంభాషణ అంతా చక్రవర్తికి విపరీతమైన కోపాన్నీ విసుగునూ తెప్పిస్తుంది. బోధిధర్మ ఆయనకు ఒక పిచ్చి వాడిగా, దురహంకారిగా అగుపిస్తాడు.
తన మాటలు చక్రవర్తికి అర్థం కాలేదని గ్రహించిన బోధిధర్మ,నదిని దాటి ఉత్తర చైనాను చేరతాడు.అక్కడ షావోలిన్ మఠంలో తొమ్మిదేళ్ళు ఉండి నలుగురు శిష్యులకు తన బోధనల సారాన్ని తెలియపరుస్తాడు
నేను భారతదేశానికి వెళ్లేందుకు సమయం వచ్చింది
నేను వెళ్తున్న అని చెప్పి
తన నలుగురు శిష్యులలో ఒక్కర్ని శిక్షకుడిగా నియమించిస్తాడూ
బోదిధర్మ భారతదేశానికి వెళ్ళడం ఇష్టం లేని
ఒక శిష్యుడు బోదిధర్మడి ఆహారం లో
విషం పెట్టి చంపుతాడు
బోదిధర్మడి బౌతికాయాన్ని ఒక శవపేటికలో పెట్టి
అక్కడికి దగ్గరలో గల ఒక గుహలో సమాది చెస్తారూ
మూడు ఏళ్ల తరువాత,ఒక సరిహద్దు సేనానికి,బోదిధర్మ
ఆ మహా పురుషుడు భారతదేశం వైపు నడుస్తుఒక్కరికీ కనిపింస్తాడు
తన చేతికర్రకు ఒక్క గడ్డి చెప్పు వెలాడుతు కనిపిస్తడూ బోదిధర్మడూ
అది చుసిన వ్యక్తి ఎటువెళ్తున్నాం అడిగితే
బోదిధర్మ నేనూ నా భారతదేశానికి వెళ్తున్న అనీ సమాధానం ఇచ్చడూ
నువ్వు ని చెతిలో చెప్పును ఎందుకు పట్టుకున్నవు అని అడుగుతాడూ
అప్పుడూ బోదిధర్మ దీనికీ సమాధానం కావాలంటే
నువ్వు షావోలిన్ నగరానికి వెళ్లవలసి ఉంటుంది అని
నవ్వుతూ సమాధానం ఇస్తాడు వెళుతూ వెళుతూ
త్వరలో మీ రాజు చనిపోతాడు అని చెబుతాడు
అలానే నన్ను చుశాను అని ఎవరికైనా చెబితే
నువ్వు ఇబ్బందులో పడుతావు అని చెప్పిం వెళ్తాడు
బోదిధర్మ
ఆ వ్యక్తి వెంటనే వెళ్లి రాజుగారికి విషయాన్ని
చెబుతాడు ...
ఆ వ్యక్తి మాటలు నమ్మని రాజు ఆ వ్యక్తని చెరశాల లో బందిస్తాడు
ఎందుకైనా మంచిది అని బోదిధర్మడి సమాదినీ తెరచి చుస్తే అక్కడ
ఒక్క చొప్పు మాత్రమే ఉంటుంది
బోధిధర్మ చెప్పినట్లే చక్రవర్తి త్వరలోనె మరణిస్తాడు
చైనా ప్రజలు ఇప్పటికీ బోదిధర్మడు చనిపోయాడు అంటే నమ్మరు..
భోదిధర్మడు తెలుగు వాడు అని చెప్పడానికి ఆధారంలు
* 1959 లో తెలుగుభాషా సమితి ప్రచురించినా
విజ్ఞానసర్వస్వము లో పల్లవులు తెలుగువారే
అనడానికి అనేక ఆధారాలు చూపించారు
* ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర . సంస్కృతి అనే
గ్రంథం కుడా ఇదే విషయాన్ని ధ్రువీకరించడం జరిగింది
0 Comments