తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం రాత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్, ఉన్నతాధికారులు సీఎం సమీక్షకు హాజరయ్యారు.
అమెజాన్ దీపావళి సేల్ | హోమ్ & కిచెన్ ప్రోడక్టుల ప్రారంభ ధర రూ. 49/- మాత్రమే!
Tribal Reservation: తెలంగాణలోని గిరిజనులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి రానుంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో.. 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాటకు కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో.. రాష్ట్రంలోని గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతం రిజర్వేషన్ల విధానాన్నే ఇప్పటిదాకా కొనసాగించారు. తాజాగా ఉత్తర్వులతో.. రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి.
0 Comments