telugu news:రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం



హైదరాబాద్‌ (‌చట్టం) : రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రిగా మార్చేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో కరోనాకు మాత్రమే వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో మూడో దశకు కరోనా చేరకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. అదే విదంగా వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Reactions

Post a Comment

0 Comments