telugu news:దుబాయిలో ఉన్న తెలుగువారిని కాపాడాలి||chattam telugu

telugu news:దుబాయిలో ఉన్న తెలుగువారిని కాపాడాలి||chattam telugu


హైదరాబాద్‌ (‌చట్టం) : ఉపాధి కోసం దుబాయికి వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది కార్మికులను తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అక్కడి దౌత్య కార్యాలయ అధికారులపై ఉందని, వెంటనే స్పందించి దుబాయిలో ఉన్న తెలుగు వారి సంక్షేమాన్ని పట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని గల్ఫ్ ‌తెలంగాణ వెల్ఫేర్‌ అం‌డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాట్కూరి బసంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండం చేస్తున్న ప్రస్తుత తరుణంలో దుబాయిలో ఉన్న అధిక శాతం తెలుగువారు భవన నిర్మాణ కార్మికులే నని, అక్కడి ప్రభుత్వం తెలుగు వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:కరోనా వ్యాధి నిరోధానికి గ్రామాలకు కంచె

పైగా అక్కడి కంపెనీలు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా మన వాళ్లతో పని చేయించుకుంటున్నారని, దీని వల్ల తెలుగువారు అధిక శాతం కరోనా వైరస్‌ ‌బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Post a Comment

0 Comments