nizamabad news:హోమ్ క్వారంటైన్ అతిక్రమించి నందుకు ఇద్దరిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

nizamabad news:హోమ్ క్వారంటైన్ అతిక్రమించి నందుకు ఇద్దరిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

nizamabad news

నిజామాబాద్ (‌చట్టం) : విదేశాలనుండి వచ్చినవారు తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండవలసిందిగా ఆదేశించినప్పటికీ నందిపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదేశాలు అతిక్రమించడం పై జిల్లా కలెక్టర్ వారిపై చర్యలకు ఉపక్రమించారు.
నందిపేట మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ నుండి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమించినందుకు వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారిని ప్రభుత్వం ఐసోలేషన్ వార్డుకు తరలించవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాక్ డౌన్ ఆదేశాలు ఎవ్వరు అతిక్రమించిన కూడా చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0 Comments