ఢిల్లీ : కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, అనేక సంస్థలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టాటా ట్రస్ట్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున రూ.500కోట్లను ఖర్చు చేయనున్నట్లు రతన్‌టాటా తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘కొవిడ్-19 విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధమే. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్ ఆఫ్ కంనీస్, టాటా ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా’ అని ట్వీట్ చేసిన ఆయన రూ.500 కోట్లను దేని కోసం ఖర్చు పెట్టనున్నారనేది కూడా వివరించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పెరుగుతున్న కరోనా కేసులకు అవసరమైన శ్వాస సంబంధిత పరికరాలు, కరోనా నిర్ధారణ కిట్స్, కరోనా బాధితులకు చికిత్స అందించే సౌకర్యాలు మెరుగు పరచడానికి, హెల్త్ వర్కర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.
0 Comments