36‌వ డివిజన్‌లో నిత్యవసర వస్తువులు పంపిణి చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ ‌సూరన్న

నిజామాబాద్‌ (‌చట్టం) : నగరంలోని 36వ డివిజన్‌లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గుప్త స్థానిక కార్పోరేటర్‌ ‌మాస్టర్‌ ‌శంకర్‌తో కలిసి స్థానిక డివిజన్‌లోని పేద ప్రజలకు కూరగాయలు, బియ్యం, పంపిణి చేశారు. ఈ సందర్బంగా సూరన్న మాట్లాడుతూ ఇందూర్‌లోని ప్రజలంతా ఎవరూ కూడా బయటకి రావద్దని దయచేసి ప్రజలందరు ప్రభుత్వాన్ని సహకరిస్తూ జారీ చేసిన సూచనలను పాటించాలని అన్నారు. ఎవరు భయాందోళనకు గురి కావద్దని స్వీయ నియంత్రన పాటిస్తూ లాక్‌డౌన్‌ ‌సమయంలో ఇండ్లకే పరిమితమై తమ తమ కుటుంబీకూలను కరోనా వైరస్‌ ‌మహమ్మారి బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవాలని అన్నారు
Reactions

Post a Comment

0 Comments