100 ‌కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

100 ‌కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి


స్వగ్రామాన్ని చేరుకోవడానికి ఓ నిండు గర్బిణి భర్తతో కలిసి ఆహారం కూడా లేకుండా 100కిలోమీటర్లు కాలినడకన నడిచిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతున్న నేపధ్యంలో స్వగ్రామానికి చేరుకోవడానికి వేరే మార్గం లేక ఈ సాహసానికి పూనుకొంది. ఉత్తర ప్రదేశ్‌లో పహ్రాన్‌పూర్‌లోని ఓ కర్మాకారంలో వకీల్‌ అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. కరోనా కారణంగా కర్మాగారం మూసివేయడంతో అతను పనులతో పాటు నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఊరికి వెళ్లడానికి యాజమాన్యం డబ్బులు కూడా ఏమి ఇవ్వకపోవడంతో చేసేదేమిలేక వకీల్‌, ‌నిండు గర్బిణి అయిన తన భార్య యాస్మిన్‌తో కలిసి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి స్వగ్రామం అమర్‌ఘడ్‌కు కాలినడకన బయలుదేరారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా జాతీయ రహదారుల వెంట ఉన్న భోజనశాలలు మూతపడడంతో రెండు రోజులుగా ఏమి తినకుండా నడక సాగించారు. ఈ జంట శనివారం నాటికి మీరట్‌లోని షోహ్రాబ్‌ ‌గేట్‌ ‌బస్టాండ్‌ ‌వద్దరు చేరుకున్నారు. వీరి దీన స్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకునే సరికి నిండు గర్బిణి రెండు రోజులుగా భోజనం లేకపోవడం, పైగా 100కిలోమీటర్లు కాలినడక నడక సాగించడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ సంఘటన స్థానికులతోపాటు పోలీసులను కదిలించింది. పోలీసులు గమనించి పరిచర్యలు చేసి ఆ దంపతులకు స్థానికుల సహాయంతో కొంత డబ్బుతో పాటు వారు బులంద్‌ ‌షహర్‌ ‌జిల్లాలోని తమ స్వగ్రామాన్ని చేర్చడానికి అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments