ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా 800 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. సింగిల్ స్టేజ్ ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అనంతరం మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ -బెంగళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివర్సిటీ- మంగుళూరుల్లో ఏదో ఒక చోట ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో కెనరా బ్యాంక్‌లోకి తీసుకుంటారు. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఆన్‌లైన్ పరీక్ష ఇలా...
రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షలో సెక్షన్లవారీ కటాఫ్‌లు ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది.

జీడీ, ఇంటర్వ్యూ...
డిస్క్రిప్టివ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ముందుగా జీడీ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆయా కేటగిరీలవారీ ఖాళీలకు మూడు రెట్ల సంఖ్యంలో అభ్యర్థులను జీడీ, ఇంటర్వ్యూ లకు ఎంపికచేస్తారు. జీడీ, ఇంటర్వ్యూ ఒక్కో దానికి 50 మార్కులు కేటాయించారు. ఆన్‌లైన్ పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించడానికి ఓసీ అభ్యర్థులైతే 40 శాతం, మిగిలిన అందరూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.

తుదినియామకాలు
ఆన్‌లైన్ పరీక్ష , జీడీ, ఇంటర్వ్యూ లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామకాలు చేపడతారు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల వెయిటేజీ 50:20:30 గా నిర్ణయించారు.

ఎంపికైతే...
ఎంపికైనవాళ్లు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివర్సిటీ- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒక చోట ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు చదవాల్సి ఉంటుంది. వసతి, భోజనం, కోర్సు, ఇతర అన్ని రకాల ఫీజులు, జీఎస్టీ కలుపుకుని మణిపాల్‌కు ఎంపికైనవాళ్లు రూ.4,13,000 చెల్లించాలి ఎన్ఐటీటీఈను ఎంచుకున్నవారు రూ.3,54,000 చెల్లించాలి. ఈ మొత్తానికి అర్హులైన అభ్యర్థులకు తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తారు. ఉద్యోగంలోకి చేరిన తర్వాత సులభ వాయిదాల ద్వారా చెల్లించుకోవచ్చు. ఈ ఏడాది వ్యవధిలో 9 నెలల తరగతి శిక్షణ మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ - బెంగళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివర్సిటీ-మంగుళూరుల్లో నిర్వహిస్తారు. చివరి మూడు నెలలు ఏదైనా కెనరా బ్యాంకు శాఖలో ఇంటర్న్‌షిప్ చేయాలి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి మణిపాల్ యూనివర్సిటీ / ఎన్ఐటీటీఈ పీజీడీబీఎఫ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత అయిదేళ్లు ఉద్యోగంలో కొనసాగుతామని ఒప్పంద పత్రం సమర్పించాలి. మధ్యలో వైదొలిగితే రుణంగా తీసుకున్న ఫీజుతోపాటు రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. విధుల్లోకి చేరినవారికి రూ.23,700 మూలవేతనంగా లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏతోపాటు వివిధ ఆలవెన్సులు లభిస్తాయి. రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. అనంతరం శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అయిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఏడాదికి కొంత మొత్తం చొప్పున పదేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు చెల్లించిన ఫీజును బ్యాంకు తిరిగి ఇచ్చేస్తుంది.

ఖాళీలు...అర్హతలు..వయఃపరిమితి..:
మొత్తం ఖాళీలు: 800. వీటిలో అన్ రిజర్వ్‌డ్-404, ఓబీసీ-216, ఎస్సీ-120 , ఎస్టీ-60 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు సాధించాలి.
వయసు: అక్టోబరు 1, 2018 నాటికి కనిష్ఠం 20, గరిష్ఠంగా 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 13, 2018
దరఖాస్తు ఫీజు: జీఎస్టీతో కలుపుకుని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118. మిగిలిన అందరికీ రూ.708.
కాల్ లెటర్లు: డిసెంబరు 5 తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: డిసెంబరు 23, 2018
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
వెబ్‌సైట్: www.canarabank.com

0 Comments