పింఛన్‌లపై విష ప్రచారం.. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుంది: సీఎం జగన్‌

పింఛన్‌లపై విష ప్రచారం.. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుంది: సీఎం జగన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్న లక్ష్యమని.. రైతులు, పేదల కష్టాలు తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. గతంలో అర్హత ఉన్నా పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి ప్రభుత్వం అకౌంట్‌లలో డబ్బులు జమ చేసింది.

 రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి డబ్బులు జమ చేశారు.
విపక్షాలు పింఛన్లపై దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాలని గుర్తు చేశారు. ఆడిట్‌ జరుగుతుంటే పింఛన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని.. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందాలన్నదే లక్ష్యమని.. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.

గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమేనని.. ఇప్పుడు నెలనెలా పింఛన్ బిల్లు రూ.1770 కోట్లు అన్నారు. గత ప్రభుత్వంలో రూ.వెయ్యి పింఛన్ ఇస్తే.. ఇప్పుడు రూ.2750కి పెంచామన్నారు. అందరం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం..వారిని దేవుడే శిక్షిస్తాడు అన్నారు.

రాష్ట్రంలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు దక్కనివారికి కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. అసలు లంచాలు, వివక్షకు తావు లేకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశామని తెలిపారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి దాదాపు రూ.3.30 లక్షల కోట్లు అందించామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పథకాల ఇచ్చేందుకు వసూళ్లు చేశాయన్నారు.


Post a Comment

0 Comments