రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే అకౌంట్లోకి రైతుబంధు డబ్బులు

రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే అకౌంట్లోకి రైతుబంధు డబ్బులు

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. డిసెంబర్ 28 నుంచి మొదలుపెట్టి సంక్రాంతిలోపు రైతులందరి అకౌంట్లలో నేరుగా రైతుబంధు డబ్బులు వేయనుంది. గతంలో ఇచ్చినట్లుగానే విడతల వారీగా నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంతి పండుగలోపు రైతులందరికీ అందించనుంది. ఈ మేరకు రైతుబంధు కోసం రూ.7.600 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎకరానికి రూ.5 వేల చొప్పున డిసెంబర్ 28 నుంచి జమ చేయనున్నారు. దాదాపు 65 లక్షల మంది రైతులు డిసెంబర్, జనవరి నెలల్లో పెట్టుబడి సాయం అందుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం రైతుబంధు పథకం కింద రూ.66 వేల కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు పేర్కొంది. ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0 Comments