ఈ భిక్షగాడి ఆస్తి విలువ రూ.5.19 కోట్లు. నెలకు అద్దె రూపంలోనే అతడికి రూ.1.27 లక్షల ఆదాయం వస్తోంది. అయినా, రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ, ఫుట్‌పాత్‌లపై పడుకుంటాడు. వినేందుకు వింతగా ఉన్నా.. ఇది పచ్చి నిజం. కోట్ల సంపదకు అధిపతి అయుండీ, అందమైన భవంతి ఉన్నా.. ఫుట్‌పాత్‌లపై నిద్రించే లండన్‌కు చెందిన ‘డోమ్’ గురించి విని ఇప్పుడు యూకే వాసులే కాకుండా యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఇంతకీ అతడు అంత ఆస్తి ఉన్నా.. ఫుట్‌పాత్‌పై ఎందుకు పడుకోవాల్సి వస్తోంది?!
డోమ్ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు స్కూల్‌కు పంపించినా.. చదువు మాత్రం అబ్బలేదు. కానీ, ఆటల్లో మాత్రం చురుగ్గా ఉండేవాడు. దీంతో అతడికి స్కాలర్‌షిప్ వచ్చేది. అలా స్కాలర్‌షిప్‌గా వచ్చిన డబ్బులతో జల్సా చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. 13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్, సిగరెట్స్, మద్యం.. అన్నింటికీ బానిసయ్యాడు. 17 ఏళ్ల వయస్సులోనే హెరాయిన్‌కు బానిసయ్యాడు. 25 ఏళ్లు వచ్చేసరికి అతడికి అలవాటులేని వ్యసనమంటూ ఏదీ లేకుండాపోయింది.
జులాయిగా మారిన కుమారుడిని చూసి ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారూ..? పెళ్లి చేస్తే సెట్టవుతాడని భావిస్తారు. డోమ్ తల్లిదండ్రులూ అలాగే ఆలోచించి అతడికి పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు చెడు వ్యవసనాలకు దూరంగా ఉండేందుకు డోమ్ ప్రయత్నించాడు. కానీ, అతడివల్ల కాలేదు. ఈలోగా అతడి మొదటి కొడుకు కూడా జన్మించాడు.
ఆ ఇంటి అద్దె ద్వారా నెలకు రూ. 1.27 లక్షల (1300 పౌండ్లు) ఆదాయం వస్తోంది. అయితే, డోమ్‌కు డ్రగ్స్ కొనుక్కొనేందుకు ఆ మొత్తం కూడా సరిపోవట్లేదట. అందుకే రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నాడు. రోజుకు 200 నుంచి 300 పౌండ్ల వరకూ సంపాదిస్తున్నానని చెబుతున్నాడు. వాటితో డ్రగ్స్ కొనడం.. రోజంతా మత్తులో తూగటం అతడి నిత్యకృత్యం.
మత్తులో ఎక్కడపడితే అక్కడ ఫుట్‌పాత్‌లపై పడుకుంటాడు. తిరిగి తెలివి వచ్చాక అడుక్కునేందుకు బయల్దేరతాడు. ఏళ్లుగా ఇదే అతడి దినచర్య.
తన భార్య, పిల్లలు, స్నేహితులు ఎవరూ తనను పట్టించుకోరని డోమ్ చెబుతున్నాడు. 5 కోట్ల విలువ చేసే ఆ ఇంటిని కూడా అమ్మేస్తాడేమోనని కుటుంబసభ్యుల భయం. అందుకే దగ్గరికి రానివ్వట్లేదట. ఈ వ్యసనం తన జీవితాన్ని మరింత దుర్భరంగా తయారు చేస్తాయేమోనని డోమ్ ఆందోళన చెందుతున్నాడు. ‘ఇదేం జీవితం..’ అంటూ ఫ్రస్ట్రేషన్‌లో బూతులు కూడా మాట్లాడుతున్నాడు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, సాధారణ జీవితాన్ని గడుపుదామని కోరుకుంటున్నాడు. అతడి కోరిక తీరుతుందా..?!
0 Comments