హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం ..?

హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం ..?




మనమంతా హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం , హనుమంతుడు సింధూర వర్ణములో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది: ఒకరోజు హనుమంతుడు, సీతా దేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి, ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు, ఆమె రాముని పై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రాముని పై తన భక్తిని నిరూపించడానికి, హనుమంతుడు తన శరీరo మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తరువాత, రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు, భవిష్యత్తులో తనను ఆరాధించే వారు, వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని.

Post a Comment

0 Comments