ఈయన కురు వంశ పితామహుడైన భీష్మ మహారాజు దగ్గర శిక్షణ పొందాడు. అందుకే ఈయన గొప్ప మేధావిగా గుర్తింపు పొందాడు. ఈయన ద్రుతరాష్ట్రుని పాలనలో మంత్రిగానూ విజయవంతంగా పని చేశారు. పాండవులకు కౌరువులు తలపెట్టిన కొన్ని చెడు కార్యక్రమాల్లో విదురుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని పురాణాల్లో పేర్కొనబడింది.
అయితే వ్యక్తిగతంగా విదురుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఈయన చాలా నీతిగా, నిజాయితీగా బతకడమే కాదు.. గొప్ప దార్శనికుడిగా నిలిచాడు. అందుకే ఈయనను మహాత్మా అని కూడా పిలుస్తారు. విదరుడు కొన్ని కీలకమైన విషయాలు నేటి కాలంలో మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలో తెలియజేస్తాయి. ఈ సందర్భంగా విదరుడు మనుషులలో కనిపించి ఎనిమది ప్రత్యేక లక్షణాల గురించి వివరించాడు. వీటిని పాటించిన వారికి ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.. ఇంతకీ ఆ లక్షణాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం...
తెలివితేటల విషయంలో..
విదురుని నీతి ప్రకారం, మనలో ప్రతి ఒక్కరికీ తెలివితేటలు ఉంటాయి. అయితే వాటిని ఎవరైతే సరైన సమయంలో ఉపయోగిస్తారనేది అసలైన ప్రశ్న.. ఎవరైతే తమ తెలివితేటలను సరైన కాలంలో వాడతారో, సమయస్ఫూర్తిగా ఉంటారో అలాంటి వ్యక్తులే జీవితంలో సక్సెస్ సాధిస్తారు.
0 Comments