ఆ వ్యక్తి గురువు మాటల్ని వింటున్నాడు. గురువు కొనసాగించాడు. "నా దగ్గర నలుగురు శిష్యులు వున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు గొప్ప శారీరక, ఆధ్యత్మిక శిక్షణ ఇచ్చాను. మొదటి శిష్యుడు బలహీనుడు. తట్టుకోలేక పారిపోయాడు. రెండవ శిష్యుడు జాగ్రత్తపరుడు. ప్రతిదాన్నీ మరీ తీవ్రంగా పట్టించుకుని పిచ్చివాడైపోయాడు.
మూడవ శిష్యుడు తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ మానసిక, శారీరక శిక్షణకు లోనై తట్టుకోలేక క్రిందపడి మరణించాడు. నాలుగవ శిష్యుడు మాత్రమే నెమ్మదిగా, హాయిగా, ఆరోగ్యంగా వున్నాడు" అన్నాడు.
0 Comments