ప్రసవం తర్వాత అక్క, చెల్లెమ్మలు ఇంటికి చేరేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నాడు నేడుతో ఆస్పత్రుల రూపు రేఖల్ని మార్చేసి.. నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు గతంలో అరకొరగా ఉండేవని.. వసతులు కూడా సరిగా ఉండేవి కావన్నారు.
ఈ వాహనాల్లో ఏసీతో పాటూ జీపీఎస్ ట్రాకింగ్ వంటి అధునాతన సౌకర్యం ఉంటుంది. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా 102 కాల్ సెంటర్ సేవలనూ మరింత మెరుగుపరిచారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి తరలించే సమయంలో ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

0 Comments