బీజేపీకి అండగా టీఆర్‌ఎస్‌: ఉత్తమ్‌కు కేటీఆర్‌ ఫోన్‌

బీజేపీకి అండగా టీఆర్‌ఎస్‌: ఉత్తమ్‌కు కేటీఆర్‌ ఫోన్‌

లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్‌కు ఏప్రిల్ 30న ఉప ఎన్నిక జరగనుంది.
Jathi Ratnalu Movie Chitti Song Lyrics in Telugu | చిట్టి నా బుల్ బుల్ చిట్టి Telugu Song Lyrics

 ఈ ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. దీనిపై టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది.

ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దని బీజేపీ చేసిన వినతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేసీఆర్ సూచన మేరకు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు.
Inspirational Telugu Whatsapp Status Quotes Free Download

 మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments