ఏపీలో మొన్న లిస్టులో ఇళ్ల పట్టాలు రాలేదా? మీకో తీపికబురు

ఏపీలో మొన్న లిస్టులో ఇళ్ల పట్టాలు రాలేదా? మీకో తీపికబురు

AP housing scheme: ఏపీలో మొన్న లిస్టులో ఇళ్ల పట్టాలు రాలేదా? మీకో తీపికబురు– News18 Telugu

    ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) చేపట్టిన ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ (AP Housing Scheme) పథకం కింద ఇళ్లు రాని వారికి తీపికబురు. గతంలో ప్రకటించిన జాబితాలో ఇళ్ల స్థలాలు రాని వారికి మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఒకసారి లిస్టులో మీ పేరు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత 12 రోజుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు సంబంధిత వ్యక్తి, కుటుంబం వద్దకు వచ్చి వ్యక్తిగతంగా వెరిఫికేషన్ చేస్తారు. వారు గ్రౌండ్ రిపోర్టును అధికారులకు అందజేస్తారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోపు వారు అర్హులు అయితే, లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. 

    ఆ తర్వాత ఇళ్ల స్థలాల పంపిణీలో వారికి ఇళ్లు ఇస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలకు సంబంధించి 26 లక్షలకు పైగా పట్టాలను ఇప్పటికే పంపిణీ చేశారు. దీనికి సంబంధిచి మిగిలిన పనులను కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేయాలని సీఎం జగన్ వారికి ఆదేశించారు. కాలనీల్లో 98.17 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు.


    వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా పిలిచే ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. బయో మైనింగ్, డంపింగ్ యార్డులను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో జగనన్న కాలనీల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను మార్చి 31 నాటికి అందిస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. జగనన్న కాలనీల్లో ఏమేం ఉంటాయనే సమగ్ర వివరాలు అందులో ఉంటాయి.

    Post a Comment

    0 Comments