అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా నిధుల సమీకరణ ఎలా చేయాలన్నదానిపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం వచ్చే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతీ హమీని నెరవేర్చాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్‌ పెట్టాలన్నా సీఎం.., ఎర్ర చందనం విక్రయం విషయంలో కేంద్రంతో సంప్రదించి త్వరితగతిన అనుమతులు తీసుకురావలని సూచించారు. అలాగే సిలికా శాండ్‌ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

నవరత్నాలులో భాగంగా అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం లాంటి పథకాలకు నిధులు సకాలంలో సమరకూర్చుకొని లబ్ధిదారులకు అందించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అన్నారు.

Post a Comment

0 Comments