అసలే కరోనా సంక్షోభ కాలం. చేతిలో డబ్బు లేని పరిస్థితి. కట్టాల్సిన ఈఎంఐలు, అప్పులపై వడ్డీలు ఎప్పుడెప్పుడు చేతిలో ఉన్న కాస్త సొమ్మును లాగేసుకుందామా అని ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జులై 5 వచ్చినా... ఇంకా జీతాలు రాలేదు. మామూలుగా అయితే... శనివారం వస్తాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే... జులై 2న గవర్నర్ విశ్వభూషణ్... ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించారు. అదే రోజు బడ్జెట్ అమల్లోకి వచ్చింది. దాంతో... ప్రభుత్వానికి మనీ ఖర్చు పెట్టేందుకు అవకాశం చిక్కింది. మూడో తేదీని వదిలేసి... నాలుగున మనీ జమ చేస్తారని ఉద్యోగులంతా ఎదురుచూశారు. ఎందుకంటే... ఐదో తేదీ ఆదివారం కాబట్టి... ఆ రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉండవనే ఉద్దేశంతో శనివారమే ఎంతో ఆశగా చూశారు.
ట్రెజరీ కంట్రోల్ లేని కొన్ని వేతన బిల్లులను బడ్జెట్‌తో అవసరం లేకుండా ఆర్థికశాఖ కార్యదర్శి విడుదల చేయవచ్చు. కానీ, ఆ బిల్లులను కూడా ఈసారి ఆపారు. ఆదివారం ఎలాగూ మనీ రాదు కాబట్టి... ఇక సోమవారం వస్తుందనే ఆశతో ఉన్నారు ఉద్యోగులు.
0 Comments