(చట్టం -హైదరాబాద్) : రాజ్‌భవన్‌లో మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నారు. ఇక సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ఠ, వైభవానికి ప్రతీకగా ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం వీటిపై సమీక్షించనున్నారు. లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. తర్వాత మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. టెండర్లు పిలిచి కొత్త భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. రోడ్లు భవనాలశాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి, ఇంజినీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు.
0 Comments