పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్
వెళ్లే మార్గంలో ఎడమవైపున
ఉన్న శ్మశానవాటిక వద్ద రోడ్డు
చాలా చిన్నగా ఉంటుంది.
ఇక్కడ
విస్తరణకు అవకాశం
లేకపోవడంతో
వాహన ప్రమాదాలు
జరుగుతుండేవి.
హైదరాబాద్‌లో తొలి ఉక్కు ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్ అలీ ఈ స్టీల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చిలో లాక్ డౌన్ విధించేందుకు కొద్ది రోజుల ముందు ఈ వంతెన పనులు మొదలుపెట్టి కేవలం రెండు నెలల్లో పూర్తి చేయడం విశేషం. అత్యంత వేగంగా జీహెచ్‌ఎంసీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మెయిన్‌గర్డర్లు, క్రాస్‌గర్డర్లు స్టీల్‌వి వాడినట్లు అధికారులు తెలిపారు.
పంజాగుట్ట జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో ఎడమవైపున ఉన్న శ్మశానవాటిక వద్ద రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో వాహన ప్రమాదాలు జరుగుతుండేవి. సమస్య పరిష్కారం కోసం క్యారేజ్‌వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్ అవసరమని అధికారులు భావించారు. ఈ ప్రదేశంలో నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ఉక్కు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. వంతెన మొత్తం పొడవు 100 మీటర్లు. స్టీల్‌బ్రిడ్జి స్పాన్ 43 మీటర్లు
0 Comments