రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. 10 రోజుల్లో రైతుల ఖాతాలో రైతు బంధు సాయం జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన పద్ధతిలో నియంత్రిత పంటల విధానానికి రైతులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
రైతుల నుంచి తమకు వందకు వంద శాతం మద్దతు లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే పంటలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయమని సీఎం అన్నారు. రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే వారికి రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని.. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.
0 Comments