గల్ఫ్‌పై సమాజంలో మార్పు రావాలి

గల్ఫ్‌పై సమాజంలో మార్పు రావాలి

- గల్ఫ్ ‌మోజును ప్రజలు వీడాలి..
- గల్ఫ్ ‌గోసను సాలించుకుంటా...!
- తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ ‌బాధితుల సంఘం అధ్యక్షుడు బసంత్‌ ‌రెడ్డి
(చట్టం - ప్రతినిధి) యువత వృత్తి శిక్షణ, నైపుణ్యం పెంచుకుంటే ఎక్కడైనా ఉపాధి దొరుకుతుందని గల్ఫ్‌కు వెళ్లి బాధలు పడేకంటే స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ ‌బాధితుల సంఘం అధ్యక్షుడు బసంత్‌ ‌రెడ్డి హితవు పలికారు. గల్ఫ్ ‌విషయంలో సమాజంలో, ప్రభుత్వంలో, ప్రజల్లో మార్పు రావాలని సూచించారు.



న్యాక్‌ ‌సంస్థ 3నెలల పాటు ఉచితంగా వృత్తినైపుణ్యంలో శిక్షణతోపాటు సర్టిఫికెట్లను జారీ చేస్తుందని, అంతే కాకుండా ప్రైవేట్‌ ‌సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పింస్తుందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోకుండా గల్ఫ్ ‌మోజులో ఉపాధి పేరుతో అక్కడికి వెళ్లి పడరాని కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ ‌మోజును ప్రజలు వీడాలని, అక్కడి నుండి మృతదేహాలు సైతం వచ్చే పరిస్థితులు లేవన్నారు. చట్టాలు మారుతున్నాయి మనం మారాలని తెలిపారు. గల్ఫ్‌కు వెళ్లి కష్టాలు పడే వారిని వందలాదిమందిని తీసుకువచ్చానని ఇక ఇంతటితో స్వస్థి పలకనున్నట్లు తెలిపారు. గల్ఫ్‌కు వెళ్లి వారు సంపాదించేది ఏమి లేదని చేసిన అప్పులను దృష్టిలో ఉంచుకొని కష్టపడడం తప్ప వేరే ఏమి లేదన్నారు. నైపుణ్యం పెంచుకొని ఫ్రాన్స్, ‌జర్మని, బెల్జియం, జపాన్‌, ‌నెదర్లాండ్‌లకు వెళ్లాలని అక్కడ మంచి వేతనంతోపాటు యువతకు డిమాండ్‌ ‌కూడా ఉందని అన్నారు. గల్ఫ్‌లో కరోనా అనేది లేదని, అక్కడ దర్జాగా తిరుగుతున్నారని అన్నారు.న్యాక్‌ ‌సంస్థ 3నెలల పాటు ఉచితంగా వృత్తినైపుణ్యంలో శిక్షణతోపాటు సర్టిఫికెట్లను జారీ చేస్తుందని, అంతే కాకుండా ప్రైవేట్‌ ‌సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పింస్తుందని తెలిపారు. 


వీటిని సద్వినియోగం చేసుకోకుండా గల్ఫ్ ‌మోజులో ఉపాధి పేరుతో అక్కడికి వెళ్లి పడరాని కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ ‌మోజును ప్రజలు వీడాలని, అక్కడి నుండి మృతదేహాలు సైతం వచ్చే పరిస్థితులు లేవన్నారు. చట్టాలు మారుతున్నాయి మనం మారాలని తెలిపారు. గల్ఫ్‌కు వెళ్లి కష్టాలు పడే వారిని వందలాదిమందిని తీసుకువచ్చానని ఇక ఇంతటితో స్వస్థి పలకనున్నట్లు తెలిపారు. గల్ఫ్‌కు వెళ్లి వారు సంపాదించేది ఏమి లేదని చేసిన అప్పులను దృష్టిలో ఉంచుకొని కష్టపడడం తప్ప వేరే ఏమి లేదన్నారు. నైపుణ్యం పెంచుకొని ఫ్రాన్స్, ‌జర్మని, బెల్జియం, జపాన్‌, ‌నెదర్లాండ్‌లకు వెళ్లాలని అక్కడ మంచి వేతనంతోపాటు యువతకు డిమాండ్‌ ‌కూడా ఉందని అన్నారు. గల్ఫ్‌లో కరోనా అనేది లేదని, అక్కడ దర్జాగా తిరుగుతున్నారని అన్నారు.xxx

Post a Comment

0 Comments