కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో హెరిటేజ్‌ ‌సర్క్యూట్‌ ‌కోసం కుతుబ్‌ ‌షాహి హెరిటేజ్‌ ‌పార్క్, ‌పైగా సమాదులు, హయత్‌ ‌బక్షి మసీదు, రేమండ్స్ ‌సమాధి వంటి వాటి అభివృద్ది కోసం 100కోట్లు మంజూరు చేసి ఇప్పటి వరకు కేవలం 48కోట్లు విడుదల చేసి మిగితా బ్యాలెన్స్ ‌మొత్తాన్ని విడుదల చేయలేదని తెలుపుతూ స్పీకర్‌ ‌ద్వారా పర్యాటక మంత్రిత్వ శాఖ దృష్టికి పార్లమెంట్‌లో జహిరాబాద్‌ ఎం‌పి బిబి పాటిల్‌ ‌తీసుకెళ్ళారు. స్వదేశ్‌ ‌దర్శన్‌ ‌పథకం కింద ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ ‌కింద ఝరాసంగం వద్ద శ్రీకేతకి సంగమేశ్వర ఆలయం, రెజింత్‌ ‌వద్ద సిద్ది వినాయక్‌ ఆలయం, మద్నూర్‌లోని హనుమాన్‌ ఆలయం, నల్ల పోచమ్మ ఆలయం మొదలైన వాటిని చేర్చడానికి కాన్సెప్ట్ ‌ప్లాన్‌ను ఫిబ్రవరి-2020లో పర్యాటక మంత్రిత్వ శాఖకు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసాద్‌ ‌పథకం కింద గుర్తించిన జోగులాంబ ఆలయానికి, స్వదేశ్‌ ‌దర్శన పథకం కింద గుర్తించిన కామారెడ్డి వద్ద ఉన్న కౌలాస్‌ ‌కోట కోసం నిదులు విడుదల చేయాలని కోరారు. మహాబూబ్‌నగర్‌ ‌జిల్లాలో 2015-16లో రూ.92 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన ఏకో టూరిజం సర్క్యూట్‌ ‌యొక్క ప్రస్తుత స్థితిని, 2016-17లో 84కోట్లతో ములుగు, లక్నవరం, బోగత నీటి గోడలు మేదరం మొదలైన వాటి యొక్క సమగ్ర అభివృద్దికి మంజూరు చేయబడిన గిరిజన పర్యాటక సర్క్యూట్‌ ‌యొక్క ప్రస్తుత పరిస్థితిని తెలియజేయాలని పేర్కొన్నారు.