వారిస్‌ ‌పఠాన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి : యెండల సుధాకర్‌

వారిస్‌ ‌పఠాన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి : యెండల సుధాకర్‌

నిజామాబాద్‌ (‌చట్టం) : కర్ణాటకలోని గుల్బర్గాలొ సీ ఏ ఏ వ్యతిరేక సభలో ఎంఐఎం మాజీ ఎం ఎల్ ఏ వారిస్ పఠాన్ మాట్లాడిన తీరుకు నిరసన గా భారతీయ జనతా పార్టీ నగర శాఖ, నగర అధ్యక్షులు యెండల సుధాకర్ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలొ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం యెండల సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు స్వాతంత్రం అనేది అడుక్కుంటే వచ్చేది కాదు మనం బలవంతంగా గుంజుకోవాలి మేము 15 కోట్ల మందిమే కానీ 100కోట్లకు సరిపోతాం తేల్చుకుందాం అని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయటం ఇదే వేదికను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి పాల్గొని వ్యాఖ్యలకు వత్తాసు పలకడమే అయింది.. అట్లాగే ఒవైసి పాల్గొన్న సభల్లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తేర వెనుక ఏంజరుగుతున్నది.

అనేది గమనించాల్సింది దేశ వ్యతిరేకంగా మోసపూరిత మాటలతో విషం చిమ్మతున్నారని తెలిపారు. ఈ దేశం లొ 400 సంవత్సరాలు పైబడి ఔరంగజేబులు, మహమ్మదీయులు ఈ దేశాన్ని పాలించి కేవలం ప్రగల్బాలతో అనేక అరాచకాలకు పాల్పడినా ఈ దేశాన్ని సంస్కృతిని ఎం చేయలేకపోయారని అన్నారు. ఈ విషయాన్నీ ఔరంగజేబు వారసులు ఎంఐఎం నాయకులు గుర్తుంచుకోవాకోవాలని సూచించారు. నువ్వు, నీ నాయకులు ఏ భాష లొ మాట్లాడితే అదే భాష లొ సమాధానం ఇవ్వడానికి మాటలకైనా చేతలకైనా మేము సిద్దమే...సంయమనం పాటిస్తున్నాం గతం లొ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ముస్లిం సమాజం పూర్తిగా ఖండించిందని, ఇకనైనా బుద్ది తెచుకోక పొతే మీరు తీసుకున్న గోతి ని మీరే తవ్వుకుంటున్నాన్నారని అన్నారు. వారిస్ పఠాన్ ఎవరి చేతిలో కీలు బొమ్మ గా మారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోగలరని, వెంటనే దేశద్రోహం కేసుతో పాటు కఠినమైన చట్టాలు వుపయోగించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారిస్‌ ‌పఠాన్‌ ‌దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యాక్రమంలొ నగర ప్రధాన కార్యదర్శులు స్వామి యాదవ్, నాగరాజు, కౌడపు భరత్ భూషణ్, శ్రీనివాస్ శర్మ,నారాయణ యాదవ్,గంగోని గంగాధర్, పల్నాటి గంగాధర్, దుబాయ్ శ్రీను,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments