కరోనా వైరస్ కలవరం.. ఫీవర్ ఆస్పత్రికి మరింత మంది..

కరోనా వైరస్ కలవరం.. ఫీవర్ ఆస్పత్రికి మరింత మంది..

రెండు రోజుల క్రితం వైరస్ అనుమానిత లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో చేరిన వారి నమూనాలను పుణెకు పంపించగా.. పరీక్షల్లో వారిద్దరిలోనూ కరోనా వైరస్ లేదని నిపుణులు తేల్చారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించిన సంగతి తెలిసిందే. నిరంతరం రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేస్తోంది.
Telugu News,

మరోవైపు, కరోనా వైరస్ బారిన పడితే వచ్చే సమస్యలు కూడా సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటున్నాయి. ఒక పక్క స్వైన్ ఫ్లూ, మరో పక్క ఈ కొత్త వైరస్ ప్రచారంతో ప్రజలు కాస్త తికమక పడుతున్నారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఆందోళనలకు గురవుతున్నారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే వారు ఆసుపత్రుల్లో చేరుతున్నారు

Post a Comment

0 Comments