నేటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.......
మొదటివిడతలో నిజామాబాదు
లో 177......
కామారెడ్డిలో
164 పంచాయతీలకు ఎన్నికలు.......
పంచాయతీ
ఎన్నికల సందడి నేటి నుండి ప్రారంభంకానుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే
గ్రామపంచాయతీలకు సంబంధించి ఎన్నికల నోటీసును రిటర్నింగ్ అధికారి నేడు విడుదల
చేయనున్నారు. నేటి నుంచి సర్పంచ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించబడును.
9వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరిగడువు విధించారు. తొలి విడతలో నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 177 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 164 గ్రామపంచాయతీలకు ఎన్నిక జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో 1,764 వార్డులకు, కామారెడ్డి జిల్లాలోని 1,508 వార్డులు తొలి విడతలో పోరు జరగనుంది.

గ్రామాల్లో
ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ. 10 లక్షల ప్రోత్సాహం ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో అనధికార ఏకగ్రీవాలకు శ్రీకారం చుడుతున్నారు.
భీంగల్ మండలంలో సుదర్శన్నగర్ తండా, జక్రాన్ పల్లి మండలం వివేక్ నగర్ తండా నవీపేట్ లో మిట్టాపూర్
గ్రామం, ధర్పల్లిలో దుబ్బాక ఎస్ బీ తండా, మద్దుల్ తండా, గోవిందపల్లిలో ఏకగ్రీవాలకు తీర్మానం చేసినట్లు
తెలిసింది. ఇక కామరెడ్డి జిల్లాలోని లింగంపేట్లో భూంబోజి పేట తండా, కొండాపూర్ తండా, రాంపల్లి గ్రామాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు
జరుగుతున్నాయి.

0 Comments