‘చట్టం తెలుగు: నేనొక్కడినే’ కాంబినేషన్ (సుకుమార్– మహేశ్‌బాబు) వన్స్‌మోర్ రిపీట్ కానుందన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మంచి ఆసక్తి ఏర్పడింది. సుకుమార్ కథ తయారు చేసే పని మీద ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజా సమాచారమేంటంటే సుకుమార్ కథ అవుట్లైన్ను తయారు చేసేశారట. అలాగే మహేశ్కు వినిపించడం కూడా జరిగిపోయిందట. ఈ కథ మహేశ్కు చాలా బాగా నచ్చిందని, ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగై్జటింగ్గా ఉన్నారని టాక్. మహేశ్ కెరీర్లో మునుపెన్నడూ చూడనటువంటి కమర్షియల్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, మోహన్ చెరుకూరి, నవీన్ యర్నేని నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుందట. ఇందులో మహేశ్ సరసన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటించొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మహేశ్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది మరిన్ని స్టోరిల కోసం https://chattamtelugu.blogspot.com

0 Comments