కేంద్రంలోని మోది సర్కార్ అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సుప్రింకోర్టు 50శాతం రిజర్వేషన్లకు మించి ఇవ్వరాదని పరిమితి పెట్టింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ ఆమోద ముద్ర వేయగా కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నిక్కుల జిమ్మిక్కుగా, రాజ్యాంగ విరుధంగా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తున్నాయి.
ఐతే అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లొ 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ముందడుగుగానే చెప్పవచ్చు. ప్రస్తుతం జనరల్ కోటగా ఉన్న 50శాతం నుంచే మరో 10శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లను కల్పించనున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో ఎటువంటి మార్పు ఉండదు. ఇక రాజ్యాంగ సవరణకోసం తయారు చేసిన బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘోరంగా పరాజయం పాలు కావడంతో మోది సర్కారు ఇటువంటి నిర్ణయం తీసకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రిజర్వేషన్ అనేది కీలక నిర్ణయం :
లోక్ సభకు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ కోణంగా అభివర్ణిస్తున్నవారు లేకపోలేరు. అగ్రవర్ణాలలోని పేదలు ఎప్పటి నుండో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఏ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి రిజర్వేషన్లు కల్పించడానికి సాహసించలేదు.(పంచాయతీ ఎన్నికల సమాచారం కోసం https://chattamtelugu.blogspot.com)

0 Comments