ఎస్సీ.ఎస్టీ ఉపాధ్యాయ జిల్లా సంఘం అధ్యక్షకార్యదర్శుల ఏకగ్రీవం

ఎస్సీ.ఎస్టీ ఉపాధ్యాయ జిల్లా సంఘం అధ్యక్షకార్యదర్శుల ఏకగ్రీవం



నిజామాబాద్‌ (‌చట్టం): నిజామాబాద్‌ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షకార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటి తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్‌అం‌డ్‌బి అతిధిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా ఎన్నికైన వారికి దృవపత్రాలను అందజేసారు. 



అధ్యక్షుడిగా మోతె మోహన్‌, ‌ప్రధానకార్యదర్శిగా రాంచందర్‌గైక్వాడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సంధర్బంగా ఎన్నికైన కార్యవర్గం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఉద్యమాలు చేపడుతూనే సంఘ అభివృద్దికి కృషిచేస్తామని, మాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా మమ్మల్ని అధ్యక్షకార్యదర్శులుగా ఎన్నుకున్నందులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్షుడు వెంకటి, సాయన్న, సుశీల్‌కుమార్‌, ‌సనీత్‌ ‌వినోద్‌కుమార్‌, ‌రవిందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments