Bharat Rashtra Samithi జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు: కేసీఆర్

Bharat Rashtra Samithi జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు: కేసీఆర్


Kcr New Party గులాబీ బాస్ కేసీఆర్ నవశకానికి నాంది పలికారు.. విజయ దశమి రోజు దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతూ జాతీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ (Bharat Rashtra Samithi Party)ని ప్రకటించారు.. అనంతరం పార్టీ పేరు మారుస్తూ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది పార్టీ నేతలకు వివరించారు.
ఈ సందర్భంగా జాతీయ పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఆషామాషీది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ‘‘జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాం.. నేను సీఎంగా ఉంటూనే దేశం మొత్తం పర్యటిస్తాను.. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదు.. తెలంగాణ కోసం కష్టపడినట్టు దేశం కోసం కష్టపడదాం.. దేశంలో ఇంకా కుల, లింగ వివక్ష కొనసాగుతోంది.. దేశాన్ని ఏలిన పార్టీలు.. తెలంగాణకు కేంద్రం చేసిందీ ఏమీ లేదు.. రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఆట..
టీఆర్ఎస్‌కు రాజకీయాలు టాస్క్.. దేశ ప్రజల సమస్యే ఎజెండగా జాతీయ పార్టీ ఏర్పాటు.. రాష్ట్రం, దేశం అభివృద్ది చెందితేనే సమగ్రాభివృద్ధి.. తెలంగాణను బాగుచేసుకున్నట్టే.. దేశాన్ని బాగుచేసుకుందాం.. మన జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘం మహారాష్ట్రదే.. మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర నుంచే ఎంచుకుంటాం.. దేశాన్ని ఏలిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదు.. దేశంలో కుల, లింగ వివక్ష ఇంకా కొనసాగుతోంది.. రైతు బంధు, దళిత బంధును చూసి ఆశ్చర్యపోతుతున్నారు.. ఇవన్నీ పక్క రాష్ట్రాలు చూసి ఆశ్చర్యపోతున్నాయి.. సమష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యింది.. మాతో కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తాం’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments