సీఎం జగన్ కడప జిల్లాలో వైఎస్‌ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రారంభించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను సైతం ప్రారంభించారు. డిక్సన్ పరిశ్రకు కేటాయించిన నాలుగు షెడ్లను ప్రారంభించి, మరో 18 చిన్న పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సీఎం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...‘‘ఇప్పటికే రాష్ట్రంలో డిక్సన్ సంస్థ ఏర్పాటైంది. ఏప్రిల్ నాటికి పరిశ్రమలో 1800 మందికి ఉపాధి లభిస్తుంది. శిక్షణ అనంతరం పరిశ్రమలో ఉపాధి లభిస్తుంది. ఆరు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. వచ్చే 9నెల్లలో కొత్త సంస్థల్లో 7,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు వీవీడీఎన్ సంసిద్ధత తెలిపింది. ఇక్కడి హబ్‌లో మరో 18 ఎంఎస్‌ఎంఈలకు శంకుస్థాపన జరిగింది. ఎంఎస్‌ఎంఈల్లో 1200 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక వాడలతో రాయలసీమ అభివృద్ధి చెందుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు.
0 Comments