తల్లిదండ్రుల మాట జవదాటని వాడు. ఏకపత్నీ వ్రతుడు, నిత్యం సత్యం పలికే మహానుభావుడు. అంతేకాదు, ఈయన పాలన అందరికంటే అత్యుత్తమంగా సాగిందని పండితులు చెబుతుంటారుఈయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. అందరూ ధర్మాన్ని పాటించేవారు. ఈయన పాలనలో ప్రజలకు బాధలు అనేవే ఉండేవి కావు. అందుకే ఈ రాముడిని అన్ని మతాల వారు ఇష్టపడేవారు. .
Telugu Love Quotes What'sapp Status Images Free Download
అంతేకాదు శ్రీరాములోరిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఛైత్రమాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో హనుమాన్, రాములోరి దేవాలయాలతో పాటు అనేక దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీరాముడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు.. మంచితనానికి, జాలి, దయ, నమ్మకానికి చిరునామాగా ఉండేవాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడని అంటారు. ఈ సందర్భంగా ఆ యుగ పురుషుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
రాముని పేరు రఘు రాజ వంశం యొక్క గురువు వశిష్ట మహర్షి చేత వచ్చింది. పురాణాల ప్రకారం, విష్ణువు దశావతారాలలో రాముని ఏడో అవతారం. వాల్మీకి రామాయణం ప్రకారం, రాముడు పురుషోత్తముడు. అయితే తులసీదాస్ మాత్రం రాముడిని దేవుడని వివరించాడు.పురాణాల ప్రకారం, రాముడు త్రేతా యుగానికి చెందిన వారుగా చెబుతారు. అంటే సుమారు పది వేల సంవత్సరాల క్రితం రాముని జననం జరిగినట్లు చెప్పొచ్చు. శ్రీరాముడు జన్మించిన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా కనిపించాడట.
ఆశ పాశం బందీ సేసేలే… సాగే కాలం ఆడే ఆటే లే here is Telugu Lyrics of this song.
రాముడు, లంకలో రావణుడిని సంహరించిన తర్వాత, రాముడు . తన రాజ్యంలో ఎవ్వరికీ కష్టాలనేవి ఉండేవి కావు. దొంగల బాధ అసలే లేదంట. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించారట. ఉన్నతమైన వ్యక్తిత్వం జీవించేవారట. ఆయన కాలంలో వర్షాలు సరైన కాలంలో కురవడం వల్ల, పంటలు కూడా సమయానికి చేతికొచ్చేవట.శ్రీరామ నవమి రోజు శ్రీరాముడు పుట్టాడని ఆరోజును వేడుకగా జరుపుకుంటున్నప్పటికీ, ఇదే రోజున మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. శ్రీరామునికి నవమి రోజున పట్టాభిషేకం జరగడం వల్ల దేశవ్యాప్తంగా నవమి వేడుకలు జరిగాయట. మరోవైపు నవమి రోజున శ్రీసీతారాములోరి కళ్యాణం జరిగిందట. అందుకే, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాములోరి కళ్యాణం జరిపిస్తారట
0 Comments