శివరాత్రి కథ ఇదిగో.. పరమేశ్వరుడే పార్వతిదేవికి బోధించిన పవిత్ర గాధ

శివరాత్రి కథ ఇదిగో.. పరమేశ్వరుడే పార్వతిదేవికి బోధించిన పవిత్ర గాధ



"శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు" అనే విషయం అందరికి తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమి జరగవు. ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు.

పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దపోయే దాకా ఎదురుచూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు.

    ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా.. జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ, ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మాములుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేకవదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా.. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగివస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికే సరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు.

    Post a Comment

    0 Comments