భగవద్గీత గురించి మీకు తెలియని విషయాలు

భగవద్గీత గురించి మీకు తెలియని విషయాలు


 భగవత్ గీత లోని ప్రతి శ్లోకం మనకి ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో, ఏది మంచి, ఏది చెడు దాకా నిత్యం మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమధానం చెబుతుంది . అందుకే గీతా పారాయణ ఒక్కటి చాలు బాధ ని పోగొట్టటానికి అనేది. గీత లోని  ఈ శ్లోకాన్నే చూడండి ..మన జీవితానికి ఎంత మార్గ నిర్దేశం చేస్తుందో.

యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇంద్రియాణీంన్ద్రీయార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58


తాబేలు నేర్పే పాటం
తాబేలుని చూడండి ఏ కొంచం శబ్దం గాని, అలజడి గాని కలిగితే వెంటనే తన అవయవా లన్నిటిని లోపలకి (చిప్పలోకి ) ముడుచు కుంటుంది. దానికి తన అవయవాలు అంత స్వాదీనం లో వుంటాయి. మనం కూడా మన ఇంద్రియాలను అలా అధినం లో ఉంచుకోవాలని చెబుతోంది ఈ శ్లోకం. అలవాటుగా అవి చెడు విషయాల మీదకి మళ్ళినా, వాటిని వెంటనే ఆదీనంలోకి తెచ్చుకుంటే , సమస్యలు రావు . ఇంకో మాటలో చెప్పాలంటే ఇంద్రియాలని ఆదీనంలో వుంచుకుంటే..


 జ్ఞానం స్థిరంగా ఉంటుందని సాధకులు అన్వయించుకుంటే , సామాన్యులు "మనసు ఎప్పుడు మన బుద్ధికి లోబడి వున్నప్పుడు మంచి , చెడు విశ్లేషణ సాధ్య పడుతుందని, ఆ విశ్లేషణ మనల్ని వివేకులని చేసి సమస్య లని కొని తెచ్చుకోకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా ఒకో శ్లోకం మనకి మార్గనిర్దేశం చేసే దీపం లాంటిది. ఆ వెలుతురు లో ప్రయాణం చేస్తే గమ్యం చేరటం సులువు అవుతుంది.

Post a Comment

0 Comments